శ్రీకాంత్ శ్రీరామ్, ఖుషీ రవి జంటగా నటిస్తున్న చిత్రం పిండం. ది స్కేరియస్ట్ ఫిల్మ్ ఉపశీర్షిక. సాయికిరణ్ దైదా ఈ చిత్రానికి దర్శకత్వం. సాయికిరణ్‌కు ఇదే మొదటి మూవీ. తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ మ్యూజికల్ అప్‌డేట్ ఇచ్చారు. ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ జీవ పిండం అని సాగే పాటను దర్శకుడు అనిల్ రావిపూడి విడుదల చేశారు. ఇక ఈ పాటను అనురాగ్ కులకర్ణి పాడగా, కవి సిద్దార్థ లిరిక్స్, కృష్ణ సౌరభ్ సూరంపల్లి సంగీతం అందించారు. ఈ సినిమా నుంచి మోషన్ పోస్టర్, ఫస్ట్ లుక్‌తో పాటు టీజర్ విడుదల చేయగా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.














