Namaste NRI

సలార్‌ ట్రైలర్‌ రిలీజ్‌ అప్పుడే

ప్రభాస్‌ కథానాయకుడిగా ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రం సలార్‌-1. ఈ చిత్రాన్ని హోంబలే ఫిల్మ్స్‌ పతాకంపై విజయ్‌ కిరంగదూర్‌ నిర్మించారు. ప్పథ్వీరాజ్‌ సుకుమారన్‌, శృతిహాసన్‌, ఈశ్వరీరావు, జగపతిబాబు, శ్రియా రెడ్డి తదితరులు నటిస్తున్నారు.  ఈ చిత్ర టీజర్‌కు దేశవ్యాప్తంగా అద్భుతమైన స్పందన లభించింది. ైస్టెలిష్‌ మేకింగ్‌తో టీజర్‌ ఆకట్టుకుంది. దాంతో ఈ సినిమా ట్రైలర్‌ కోసం ప్రభాస్‌ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్ర ట్రైలర్‌ను డిసెంబర్‌ 1న విడుదల చేయబోతున్నట్లు తెలిసింది. అనేక సర్‌ప్రైజ్‌ల సమాహారంగా హై ఇంటెన్సిటీ యాక్షన్‌ సీక్వెన్స్‌తో ట్రైలర్‌ ఆకట్టుకోనుందని చెబుతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతున్నది. ఓ ప్రత్యేక గీతాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. డిసెంబర్‌ 22న ప్రేక్షకుల ముందుకురానుంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events