Namaste NRI

తప్పకుండా ఈ సినిమా అందరికీ నచ్చుతుంది :  విక్రాంత్‌

విక్రాంత్‌ హీరోగా నటిస్తున్న చిత్రం స్పార్క్‌ లైఫ్‌. డెఫ్‌ ఫ్రాగ్‌ ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మించింది. మెహరీన్‌, రుక్సర్‌ థిల్లాన్‌ కథానాయికలు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో ఈవిల్‌ సైడ్‌ ఆఫ్‌ స్పార్క్‌ లైఫ్‌ పేరుతో ఓ స్నీక్‌ పీక్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా విక్రాంత్‌ మాట్లాడుతూ ఇప్పటి వరకు స్పార్క్‌ నుంచి ప్రేమ, యాక్షన్‌, ఇన్వెస్టిగేషన్‌ను చూపించాం. ఇప్పుడు ఈవిల్‌ను చూపిస్తున్నాం. మెహరీన్‌, రుక్సర్‌ ఈ సినిమాకి వందశాతం న్యాయం చేశారు. ఇందులోని ప్రతి షాట్‌ను ఎంతో డీటైలింగ్‌గా తీశాం. హేషమ్‌ సంగీతం, నేపథ్య సంగీతం ఆకట్టుకుంటాయి. ఈ చిత్రాన్ని కుటుంబ సమేతంగా చూడండి. తప్పులు ఉంటే చెప్పండి. తప్పకుండా ఈ సినిమా అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాం అన్నారు. ఇంత వరకు నన్ను మహాలక్ష్మిగా, హనీగా ఆదరించారు. ఈ చిత్రంలో లేఖ పాత్రను కూడా అందరూ మెచ్చుకుంటారు అంది నాయిక మెహరీన్‌. మరో నాయిక రుక్సర్‌ మాట్లాడుతూ  విక్రాంత్‌ పడిన కష్టానికి తగ్గ ప్రతిఫలం రావాలి. మా చిత్రాన్ని విజయవంతం చేయాలని అన్నారు. ఈ సినిమా నవంబరు 17న విడుదల కానుంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events