సత్యం రాజేశ్, కామాక్షి భాస్కర్ల, బాలాదిత్య ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం పొలిమేర 2. అనిల్ విశ్వనాథ్ తెరకెక్కించారు. గౌరి కృష్ణ నిర్మాత. ఈ సినిమా ఇటీవల విడుదలైన నేపథ్యంలో హైదరాబాద్‌లో గ్రాండ్ బ్లాక్‌బస్టర్ వేడుక నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా శ్రీవిష్ణు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొన్ని చిత్రాలు బాగున్నా థియేటర్స్‌లో ఆడవు. కానీ, పొలిమేర 2 వరల్డ్ కప్ జరుగుతున్న సమయంలోనూ ఇంత మంచి వసూళ్లతో విజయవంతంగా ఆడటం గొప్ప విషయం అన్నారు. ఓ సినిమా చిన్నదా, పెద్దదా అన్నది ప్రేక్షకులే నిర్ణయిస్తారు. వాళ్ల ప్రకారం పొలిమేర 2 అనేది చాలా పెద్ద సినిమా. తప్పకుండా అందరూ చూడండి అన్నారు. దర్శకుడు అనిల్ విశ్వనాథ్ మాట్లాడుతూ ఈ సినిమా ప్రయాణంలో ఎన్నో అనుకొని పరిస్థితులు ఎదురయ్యాయి. కానీ, నాకు నేను ధైర్యం తెచ్చుకొని ముందుకెళ్లాం. ఈ విషయం సమష్టి కృషికీ ఫలితం. ఇకపై నా జీవితం వేరేలా ఉంటుంది అన్నారు. ఈ కార్యక్రమంలో వంశీ నందిపాటి, కామాక్షి భాస్కర్ల, సాయి రాజేష్ తదితరులు పాల్గొన్నారు.














