Skip to main content

Namaste NRI

ప్రవాసులు జాగ్రత్త.. లేకుంటే భారీమూల్యం!

అరబ్ దేశాల్లో ట్రాఫిక్ నిబంధనలు  చాలా కఠినంగా ఉంటాయనే విషయం తెలిసిందే. రోడ్డు ప్రమాదాల నివారణకు అక్కడి ట్రాఫిక్ విభాగం ఇలా కఠిన నిబంధనలను అమలు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా దుబాయి ట్రాఫిక్ పోలీసులు ఇటీవల తరచూ రోడ్డు ప్రమాదాలకు కారణం అవుతున్న ఒక కీలక అంశానికి సంబంధించిన వీడియోను విడుదల చేశారు. అదేంటంటే అనుమతిలేని చోట వాహనాలను యూటర్న్ చేయడం. ఇలా నిషేధిత ప్రాంతాల వద్ద ట్రాఫిక్ రూల్స్‌ను బ్రేక్ చేస్తూ వాహనాలను యూటర్న్ చేయడంతో తరచుగా ప్రమాదాలు సంభవిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

 దుబాయి పోలీస్ విభాగానికి చెందిన స్మార్ట్ ట్రాఫిక్ వ్యవస్థ ఈ విషయాన్ని బయటపెట్టింది. దాంతో ఈ విషయాన్ని ఇకపై ఉపేక్షించేది లేదని ట్రాఫిక్ పోలీస్ డిపార్ట్‌మెంట్ వెల్లడించింది. ఈ ఉల్లంఘనకు గాను 500 దిర్హమ్స్ (రూ.11,347) జరిమానా, 4 బ్లాక్‌పాయింట్స్ వేయడం జరుగుతుందని తెలిపారు. ఇలా అనుమతిలేని చోట్లలో యూటర్న్ చేయడం వల్ల గత 10నెలల్లో ఏకంగా 29,463 ప్రమాదాలు జరిగినట్లు తెలిసింది. ఈ ఘటనల కారణంగా ఆరు మంది తీవ్రంగా గాయపడ్డారని అధికారులు వెల్లడించారు. ఇకపై ఇలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా నివారించడంలో భాగంగా కఠిన నిబంధనలు అమలు చేయనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా వాహనదారులను ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని దుబాయ్ పోలీసులు కోరారు.

Social Share Spread Message

Latest News