మమ్ముట్టి హీరోగా నటిస్తున్న చిత్రం బజూక. డీనో డెన్నిస్ కథనందిస్తూ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది. దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెకండ్ లుక్ ను విడుదల చేశారు. బ్లాక్ గాగుల్స్ పెట్టుకున్న మమ్ముట్టి గడ్డంతో కనిపిస్తున్నాడు. ఈ చిత్రంలో గౌతమ్ వాసుదేవ్ మీనన్, టామ్ షైన్ ఛాకో, సుమిత్ నావల్, సిద్దార్ధ్ భరతన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. హై బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని థియేటర్ ఆఫ్ డ్రీమ్స్ అండ్ సరిగమ బ్యానర్లపై డోల్విన్ కురియాకోస్ జిన్ వీ అబ్రహాం, విక్రం మెహ్రా, సిద్దార్థ్ ఆనంద్ కుమార్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి మిధున్ ముకుందన్ సంగీతం అందిస్తున్నాడు.














