రవితేజ హీరోగా నటిస్తున్న చిత్రం ఈగల్. కావ్య థాపర్, అనుపమ పరమేశ్వరన్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో నవదీప్, శ్రీనివాస్ అవసరాల, మధుబాల నటిస్తున్నారు. ఈ సందర్భంగా ఈ చిత్రం కాన్సెప్ట్ పోస్టర్ని మేకర్స్ విడుదల చేశారు. ఈగల్ అనే టైటిల్‌కి జస్టిఫికేషన్‌లా ఈ పోస్టర్ని డిజైన్ చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని మాట్లాడుతూ ఇందులో కొత్త రవితేజను చూస్తారు. ఆయన పాత్రలో రకరకాల కోణాలుంటాయి. కథానుగుణంగా విభిన్నమైన గెటప్పుల్లో ఆయన కనిపిస్తారు. సంక్రాంతి కానుకగా జనవరి 13న సినిమాను విడుదల చేస్తాం అని చెప్పారు. ఈ చిత్రానికి మాటలు: మణిబాబు కరణం, సంగీతం: డేవ్ జాన్, నిర్మాత: టి.జి.విశ్వప్రసాద్.














