Skip to main content

Namaste NRI

దూత రాకకు వేళాయే

యువ కథానాయకుడు అక్కినేని నాగఛైతన్య ఓటీటీలోకి అడుగుపెడుతున్నారు. ఆయన జర్నలిస్టుగా నటించిన సూపర్‌ నేచురల్‌ థ్రిల్లర్‌ ధూత.  ఈ సిరీస్‌లో పార్వతి తిరువోతు, ప్రియా భవాని శంకర్‌, ప్రాచీ దేశాయ్‌ ఇతర పాత్రధారులు. విక్రమ్‌ కె.కుమార్‌ దర్శకుడు. శరత్‌మరార్‌ నిర్మాత. డిసెంబర్‌ 1 నుంచి ఈ సిరీస్‌ ప్రసారం కానుంది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్‌ అవుతుంది. ఉత్కంఠను కలిగించే సూపర్‌ నేచురల్‌ థ్రిల్లర్‌ ఇదని, నాగచైతన్య, ప్రియా భవాని శంకర్‌, ప్రాచీ దేశాయ్‌ ప్రాణంపెట్టి చేశారని ప్రైమ్‌ వీడియో అపర్ణ పురోహిత్‌ అన్నారు. అంకితభావం, అవిశ్రాంత ప్రయత్నాల ఫలితం ఈ ‘దూత’ వెబ్‌సిరీస్‌ అని, విక్రమ్‌ కె.కుమార్‌ అద్భుతంగా తెరకెక్కించాడని, మంచి నటీనటులు, సాంకేతిక నిపుణులు పనిచేసిన ఈ సిరీస్‌ తప్పక ఆదరణ పొందుతుందని నిర్మాత శరత్‌ మరార్‌ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: మీకోలజ్‌ సైగులు, సంగీతం: ఇషాన్‌ చాబ్రా.

Social Share Spread Message

Latest News