ఇజ్రాయెల్ – హమాస్ యుద్ధం నేపథ్యంలో గాజాలో మానవతా సహాయం కోసం యుద్ధాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ ఐక్య రాజ్యసమితి (ఐరాస) భద్రతా మండలి తీర్మానాన్ని ఆమోదించింది. ప్రత్యేక సమావేశం లో ప్రవేశపెట్టిన తీర్మానానికి 12 దేశాలు మద్దతు తెలిపారు. అమెరికా, రష్యా, బ్రిటన్లు ఓటింగ్‌లో పాల్గొనలేదు. గాజా స్ట్రిప్‌లో మానవతా సహాయం కోసం అంతర్జాతీయ మానవతా చట్టానికి చట్టబడి ఉండాలని తీర్మానం డిమాండ్ చేసింది. పిల్లలకు రక్షణ కల్పించాలని స్పష్టం చేసింది. చైనా, రష్యాలు తక్షణం కాల్పుల విరమణ ప్రకటించాలని కోరుతుండగా, అయితే, ఆగ్నేయాసియా దేశాల కూటమి యుద్ధాన్ని ఆపాలని విజ్ఞప్తి చేసింది.














