Skip to main content

Namaste NRI

అవికా గోర్ ప్రధాన పాత్రలో.. వధువు వెబ్ సిరీస్

అవికాగోర్‌, నందు, అలీ రెజా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న వెబ్‌సిరీస్‌ వధువు. పోలూరు కృష్ణ దర్శకుడు. ఎస్వీఎఫ్‌ పతాకంపై శ్రీకాంత్‌ మొహతా, మహేంద్ర సోని నిర్మిస్తున్నారు. డిసెంబర్‌ 8 నుంచి డిస్నీ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌ కానుంది. ట్రైలర్‌ను విడుదల చేశారు. వెయ్యి అబదాలాడైనా ఒక పెళ్లి చేయాలంటారు. కానీ ఈ పెళ్లిలో అన్నీ రహస్యాలే అంటూ పెళ్లి కూతురు చెప్పిన సంభాషణతో ట్రైలర్‌ ఆసక్తికరంగా మొదలైంది. అత్తగారింటికి వెళ్లిన ఇందుపై వివిధ రకాలుగా హత్యాయత్నాలు జరుగుతుంటాయి. ఈ నేపథ్యంలో ఇందు నిజాలను ఎలా తెలుసుకుందన్నది ఆసక్తికరంగా ఉంటుందని దర్శకుడు తెలిపారు. ఈ వెబ్‌ సిరీస్‌కు కెమెరా: రామ్‌ కె మహేశ్‌, సంగీతం: శ్రీరామ్‌ మద్దూరి, దర్శకత్వం: పోలూరు కృష్ణ.

Social Share Spread Message

Latest News