Namaste NRI

హాయ్ నాన్న థర్డ్ సింగిల్ – నాని, మృణాల్ కెమిస్ట్రీ అదుర్స్

నాని, మృణాల్‌ ఠాకూర్‌ జంటగా నటిస్తున్న తాజా చిత్రం హాయ్‌ నాన్న. శౌర్యువ్‌ దర్శకుడు. వైర ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై మోహన్‌ చెరుకూరి, విజయేందర్‌ రెడ్డి నిర్మిస్తున్నారు. తండ్రీకూతుళ్ల అనుబంధం నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలకు మంచి స్పందన లభిస్తున్నది. ఒడియమ్మ పాటే మ్రోగాలి అనే పాటను హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ కాలేజీలో లాంచ్‌ చేశారు. పార్టీ థీమ్‌తో రూపొందించిన ఈ పాటలో నాని, శృతిహాసన్‌ కలిసి నర్తించారు. హేషమ్‌ అబ్దుల్‌ వహాబ్‌ స్వరపరచిన ఈ పాటను ధృవ్‌ విక్రమ్‌, శృతిహాసన్‌, చిన్మయి శ్రీపాద ఆలపించారు. నాని మాట్లాడుతూ ఫాస్ట్‌బీట్‌తో సాగే ఈ పాట యువతరాన్ని ఉర్రూతలూగిస్తుంది. కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతూ యువత జోష్‌ నింపుతుంది అన్నారు. పాన్‌ ఇండియా స్థాయిలో చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు తెలిపారు. డిసెంబర్‌ 7న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్రానికి కెమెరా: సాను జాన్‌ వర్గీస్‌, ప్రొడక్షన్‌ డిజైనర్‌: అవినాష్‌ కొల్లా, దర్శకత్వం: శౌర్యువ్‌.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events