Namaste NRI

గల్ఫ్ పాలసీ హామీలపై… ఎన్‌ఆర్‌ఐల హర్షం

తెలంగాణ ఉద్యమ నేత కేసీఆర్‌ ఆమరణ నిరాహార దీక్షను స్మరిస్తూ ఖతర్‌లో దీక్షా దివస్‌ను ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ ఖతర్ అధ్యక్షుడు శ్రీధర్ అబ్బగౌని ఆధ్వర్యంలో  కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.  ఈ సందర్భంగా శ్రీధర్ అబ్బగౌని మాట్లాడుతూ  కేసీఆర్ ఎన్నికల ప్రచార సందర్భంగా  గల్ఫ్ కార్మికులకు 5 లక్షల ప్రమాద బీమా హామీ, వచ్చే జనవరి లో గల్ఫ్ పాలసీ తెస్తామని కేటీఆర్‌ ఇచ్చిన హామీ పై హర్షం వ్యక్తం చేశారు. 30న జరిగే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ హ్యట్రిక్‌ సాధిస్తుందని ధీమాను వ్యక్తం చేశారు. కాలం చెల్లిన కాంగ్రెస్ విధానాలతో, మతతత్వ బీజేపీ కి తెలంగాణలో స్థానం లేదన్నారు. ఎన్నికల్లో ప్రజలు బీఆర్ ఎస్‌కు ఓటువేసి గెలిపించాలని కోరారు.  తెలంగాణ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి ఎన్నో పథకాలను తీసుకొచ్చిందని ప్రశంసించారు. తెలంగాణను అన్ని రంగాల్లో దేశంలోనే నంబర్ వన్ గా నిలిపిన బీఆర్ఎస్ మాత్రమే ఇచ్చిన హామీలను అమలు చేస్తుందని పేర్కొన్నారు. గల్ఫ్ కార్మికులతో పాటు అన్ని వర్గాల ప్రజలు బీఆర్ఎస్‌తోనే ఉన్నారని వెల్లడించారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events