Namaste NRI

పుతిన్‌ ఐదోసారి ఎన్నికకు మార్గం సుగమం

వ్లాదిమిర్‌ పుతిన్‌ రష్యా అధ్యక్ష పదవిని ఐదోసారి చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఈ పదవికి పోటీ చేయడంపై ఆయన తన అంతరంగాన్ని ఇంత వరకు బయటపెట్టలేదు. దీనిపై విలేకర్లు అడిగిన ప్రశ్నకు క్రెమ్లిన్‌ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్‌ స్పందిస్తూ..ఓపిక పట్టండి అని చెప్పారు. దేశాధ్యక్ష ఎన్నికలను వచ్చే సంవత్సరం మార్చి 17న నిర్వహించాలని నిర్ణయించారు. పుతిన్‌ ప్రత్యర్థుల్లో అత్యధికులు జైళ్లలో కానీ, విదేశాల్లో కానీ ఉన్నారు. కాబట్టి ఆయన మరోసారి ఆ పదవికి ఎన్నిక కావడం లాంఛనమేనని విశ్లేషకులు చెప్తున్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events