శ్రీహరి హీరోగా రాజ్ తాళ్లూరి దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న జాలరి చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. మై 3 బాక్సాఫీస్ సంస్థ నిర్మిస్తున్నది. ముహూర్తపు సన్నివేశానికి హీరో వెంకట్ క్లాప్‌నివ్వగా, దర్శకుడు సముద్ర కెమెరా స్విఛాన్ చేశారు. దర్శకుడు మాట్లాడుతూ 1980 దశకంలో నడిచే కథ ఇది. కాన్సెప్ట్ చాలా కొత్తగా ఉంటుంది. ఫిబ్రవరి మొదటివారంలో రెగ్యులర్ షూటింగ్‌ను మొదలుపెడతాం అన్నారు. ఈ చిత్రానికి నిర్మాతలు: ఆదిత్య పల్లా, రఘు కుడితిపూడి, సాయికిరణ్ బత్తుల, దశరథ్ గౌడ్, దర్శకత్వం: రాజ్ తాళ్లూరి.















