Skip to main content

Namaste NRI

కల్యాణ్ రామ్ డెవిల్ రిలీజ్ డేట్ ఇదే

కల్యాణ్‌రామ్‌ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం డెవిల్‌. ది బ్రిటీష్‌ సీక్రెట్‌ ఏజెంట్‌ ఉపశీర్షిక. సంయుక్తా మీనన్‌ కథానాయిక.  స్వీయ దర్శకనిర్మాణంలో అభిషేక్‌ నామా తెరకెక్కిస్తున్నారు. పీరియాడిక్‌ స్పై థ్రిల్లర్‌ కథాంశమిది. ఈ సందర్భంగా కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ ఎవరికీ అంతు పట్టని ఓ రహస్యాన్ని ఛేదించే బ్రిటీష్‌ ఏజెంట్‌గా కల్యాణ్‌రామ్‌ పాత్ర కొత్త పంథాలో ఉంటుంది. భారీ యాక్షన్‌తో పాటు థ్రిల్లింగ్‌ అంశాలతో సాగుతుంది. కల్యాణ్‌రామ్‌ భిన్న గెటప్స్‌లో కనిపిస్తారు. ఆయన లుక్స్‌కు మంచి స్పందన లభిస్తున్నది. పాన్‌ ఇండియా స్థాయిలో విడుదల చేయబోతున్నాం అన్నారు. ఈ చిత్రాన్ని ఈ నెల 29న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేయబోతున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: సౌందర్‌రాజన్‌, సంగీతం: హర్షవర్ధన్‌ రామేశ్వర్‌, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు: శ్రీకాంత్‌ విస్సా, నిర్మాత, దర్శకత్వం: అభిషేక్‌ నామా.

Social Share Spread Message

Latest News