Namaste NRI

తెలంగాణలో టీటీఏ సేవా డేస్‌కి ఆహ్వానం… డిసెంబర్‌ 11 నుంచి 23 వరకు

తెలంగాణ తరుపున విదేశాలలో ఏర్పడిన మొట్టమొదటి సాంస్కృతిక సంస్థ తెలంగాణ అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌ (టీటీఏ). డా. పైళ్ల మల్లారెడ్డి ఆధ్వర్యంలో  2015లో మొదలై, ప్రస్తుత అధ్యక్షుడు వంశీ రెడ్డి కంచరకుంట్ల గారి ఆధ్వర్యంలో ఇప్పటికే ఎన్నో సేవా కార్యక్రమాలతో దూసుకుపోతున్న  టీటీఏ తెలుగు రాష్ట్రాలలో ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే సేవ డేస్‌ కార్యక్రమాన్ని ఈ సంవత్సరం కూడా నిర్వహించ  తలపెట్టింది. ఈ కార్యక్రమంలో విద్య ద్వారా ఉపాధి మార్గాలు, వ్యాపార వృద్ధితో ఆర్థిక వనరుల అభివృద్ధి, ఆధ్మాత్మిక ధార్మిక సాంస్కృతిక, జాబ్‌ ఓరియెంటెడ్‌, ఉపాధి కల్పన యూత్‌, మహిళా సాధాకారత కోసం చేసే అవేర్నెస్‌ కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమాలు తెలంగాణలోని హైదరాబాద్‌, అచ్చంపేట, నల్గొండ, దేవరకొండ, బోనగిరి, సిద్దిపేట, వికారాబాద్‌, యాదగిరి గుట్ట లలో ఉంటాయని తెలిపారు.  ఈ నెల 10వ తేదీ నుండి 23 తేదీ వరకు ఉన్న కార్యక్రమాలకు తెలంగాణ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని అధ్యక్షుడు వంశీ రెడ్డి  ప్రజలను కోరారు. ఈ నెల 10న హైదరాబాద్‌లో నిర్వహించే మెడికల్‌ క్యాంపుతో టీటీఏ సేవా డేస్‌ కార్యక్రమాన్ని అంకుర్పాణ చేయనుంది.

సేవా డేస్‌ కార్యక్రమానికి  సలహా మండలి చైర్‌ డా. విజయపాల్‌ రెడ్డి,  కో చైర్మన్‌ డా. మోహన్‌ పట్లోళ్ల, సభ్యుడు భరత్‌ రెడ్డి మాదాడి,  కో ఆర్డినేటర్‌ గా సురేష్‌ రెడ్డి వెంకన్న, ఇంటెర్నేషనల్‌ కో ఆర్డినేటర్‌గా డా.డి. ద్వారకనాథ రెడ్డి, కో కోర్డినేటర్‌ దుర్గా ప్రసాద్‌ సెల్‌జో, ఫౌండేషన్‌ సర్వీస్‌ చైర్‌ గా సంతోష్‌ గంటారం గారు, ఇంటెర్నేషనల్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ ప్రసాద్‌ కునారపు, హెల్త్‌ అండ్‌ వెల్నెస్‌ అడ్వైసర్‌ జ్యోతిరెడ్డి దూదిపల, నర్సింహా పెరుక కమ్యూనిటీ సర్వీసెస్‌ చైర్‌ గా, ప్రెసిడెంట్‌ గా కంచరకుంట్ల వంశిరెడ్డి, ప్రెసిడెంట్‌ ఎలెక్ట్‌గా నవీన్‌ మలిపెద్ది బాద్యతలు నిర్వహిస్తున్నారు.

తెలంగాణలోని వివిధ ప్రాంతాలలో 12వ తేదీన టీ హబ్‌లో టెక్నాలజీ పై అవగాహనా కార్యక్రమం, 16న నక్లెస్‌ రోడ్‌లో 5కే రన్‌ హెల్త్‌ పై అవగాహన కోసం నిర్వహిస్తున్నట్లు, 17న వికారాబాద్‌లో కృత్రిమ అవయవాల పంపిణి, 18న వరంగల్‌లో మెగా జాబ్‌ మేళా , చివరగా 23 తేదీన రవీంద్రభారతిలో సేవాడేస్‌ ముగింపు కార్యక్రమం గ్రాండ్‌ ఫినాలే భాగంగా లైవ్‌ మ్యూజికల్‌ నూట్‌ నిర్వహించనున్నారు. ఈ  కార్యక్రమంలో ప్రముఖ యాంకర్‌ శ్యామల, సింగర్స్‌ సాకేత్‌, మధుప్రియ తో పాటు మిమిక్రి, జానపద కళాకారులతో జానపద, వెస్ట్రన్‌ నృత్యాలు మరియు గీతాలతో సభ అట్టహాసంగా పెద్దఎత్తున నిర్వహించనున్నట్లు, తెలంగాణ అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌ మెగా కన్వెన్షన్‌ మే  2024న సియాటెల్‌  లో జరుగనున్న నేపథ్యములో ఈ కార్యక్రమాలను ముందుగా తెలంగాణ అంతటా నిర్వహించనున్నట్లు, తెలంగాణ అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌ అధ్యక్షుడు కంచరకుంట్ల వంశీ రెడ్డి తెలిపారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events