Namaste NRI

బూట్ కట్ బాలరాజు ట్రైలర్ లాంచ్

సొహైల్‌ హీరోగా నటిస్తున్న చిత్రం బూట్‌కట్‌ బాలరాజు. శ్రీ కోనేటి దర్శకుడు. ఎం.డి.పాషా నిర్మాత. మేఘలేఖ, సునీల్‌, సిరి, హన్మంత్‌, ఇంద్రజ కీలక పాత్రధారులు. ప్రముఖ దర్శకుడు అనిల్‌రావిపూడి చేతులమీదుగా ఈ చిత్రం టీజర్‌ని విడుదల చేశారు. సినిమా బాగా ఆడాలని, అందరికీ మంచి పేరు తీసుకురావాలని అనిల్‌ రావిపూడి ఆకాంక్షించారు. అనగనగా ఒక రాజు అనేది పాత కథ అయితే,  అనగనగా ఒక బూట్‌ కట్‌ బాలరాజు అనేది కొత్త కథ అనే వాయిస్‌తో మొదలయ్యే ఈ టీజర్‌ ఆద్యంతం వినోదభరితంగా కట్‌చేయడం జరిగిందని, కుటుంబ బంధాలు, స్నేహబంధాలు, ప్రేమబంధాల నేపథ్యంలో వాణిజ్యవిలువల సమాహారంగా ఈ సినిమా ఉంటుందని దర్శకుడు తెలిపారు. ఈ సినిమాను దర్శకుడు అత్యద్భుతంగా తెరకెక్కించాడని, అందరూ ఆకట్టుకునేలా కథ, కథనాలు సాగుతాయని, సాంకేతికంగా సినిమా నెక్ట్స్‌ లెవల్లో ఉంటుందని హీరో సొహైల్‌ చెప్పారు. తన తొలిప్రయత్నంలో అందరూ సహకరిస్తున్నందుకు నిర్మాత కృతజ్ఞతలు తెలిపారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events