Namaste NRI

అమెరికాలో అరుదైన ఘటన..కోట్లమందిలో ఒకరికి

ఒక మహిళకు రెండు గర్భాశయాలు ఉండటమే అరుదు. కొన్ని కోట్లమందిలో ఒక మహిళకు ఇలాంటి అరుదైన పరిస్థితి ఉంటుంది. అయితే అమెరికాకు చెందిన ఓ మహిళ రెండు గర్భాశయాల ద్వారా రెండు వేర్వేరు రోజుల్లో కవలలకు జన్మనిచ్చింది. ఇది అత్యంత అరుదైన ఘటన అని వైద్యులు తెలిపారు. అలబామా రాష్ర్టానికి చెందిన కెల్సే హేచర్‌ (32) రెండు గర్భాశయాల ద్వారా డిసెంబర్‌ 19న ఉదయం ఒకరికి, డిసెంబర్‌ 20న ఉదయం మరొకరికి జన్మనిచ్చినట్టు వైద్యులు వెల్లడించారు.

ఇద్దరూ ఆడశిశువులే కావటం, వారి ఇంట క్రిస్‌మస్‌ పండుగ ఆనందాన్ని మరింత రెట్టింపు చేసింది. హేచర్‌ రెండు రోజుల వ్యవధిలో రెండు గర్భాశయాల ద్వారా ఇద్దరు పిల్లలకు జన్మనివ్వటంపై వైద్యులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇలాంటి సందర్భాలు 5 కోట్ల మందిలో ఒకరికి జరుగుతూ ఉంటాయని ఆమెకు పురుడు పోసిన గైనకాలజిస్ట్‌ శ్వేతా పటేల్‌ తెలిపారు. రెండు గర్భాశయాలున్నా.. జననాలు సక్సెస్‌ అయ్యే అవకాశం చాలా తక్కువ. అయితే ఈ కేసులో ఇద్దరూ ఆరోగ్యంగా పుట్టారని వైద్యులు చెప్పారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events