Skip to main content

Namaste NRI

నా సామిరంగ నుంచి మంగగా.. మిర్నా మీనన్ లుక్ వచ్చేసింది

అక్కినేని నాగార్జున నటిస్తున్న తాజా చిత్రం నా సామి రంగ. విజయ్‌ బిన్ని దర్శకత్వం. ఆషికా రంగనాథ్‌ ఫీ మేల్ లీడ్‌ రోల్‌లో నటిస్తుండగా, రెండో నాయికగా మిర్నా మీనన్‌ నటిస్తున్నది. అల్లరి నరేశ్, రాజ్ తరుణ్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ  చిత్రంలో మంగ పాత్రలో మిర్నా మీనన్‌ లుక్‌ను విడుదల చేశారు. ఇందులో ఈ అమ్మడు సంప్రదాయం ఉట్టిపడే చీరకట్టులో అచ్చ తెలుగందంతో మెరిసిపోతున్నది. నచ్చిన చెలికాడి కోసం ఎదురుచూపులు చూస్తున్నట్లుగా ప్రశాంత వదనంతో కనిపిస్తున్నది. గ్రామీణ నేపథ్యంలో హృదయాన్ని కదిలించే ప్రేమకథ, స్నేహం అంశాల కలబోతగా నా సామిరంగ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో మిర్నా మీనన్‌ పాత్ర కథాగమనంలో కీలకంగా ఉంటుందని దర్శకుడు తెలిపారు. అల్లరి నరేష్‌, రాజ్‌తరుణ్‌, ఆషికా రంగనాథ్‌ తదితరులు నటిస్తున్నారు. ఈ మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ సంక్రాంతి కానుకగా ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్రానికి కెమెరా: శివేంద్ర దాశరథి, సంగీతం: ఎం.ఎం.కీరవాణి, నిర్మాత: శ్రీనివాస చిట్టూరి, దర్శకత్వం: విజయ్‌ బిన్ని.

Social Share Spread Message

Latest News