Namaste NRI

విడుద‌ల‌కు సిద్ధ‌మైన‌.. గేమ్ ఆన్‌

గీతానంద్, నేహా సోలంకి జంట‌గా న‌టించిన చిత్రం గేమ్ ఆన్‌. క‌స్తూరి క్రియేష‌న్స్ అండ్ గోల్డెన్ వింగ్ ప్రొడ‌క్ష‌న్స్‌ బ్యాన‌ర్స్‌పై ద‌యానంద్  ద‌ర్శ‌క‌త్వంలో ర‌వి క‌స్తూరి ఈ సినిమాను నిర్మించారు. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఫిబ్ర‌వ‌రి 2న గ్రాండ్ గా విడుద‌ల‌కు సిద్ద‌మ‌వుతోంది. ఈ సంద‌ర్భంగా  దర్శకుడు దయానంద్ మాట్లాడుతూ ఈ చిత్రంలో పాత్రలన్నీ గ్రే షేడ్‌లో ఉంటాయి. ప్రతి పాత్రకు ప్రాధాన్యం ఉంటుం దన్నారు. తన జీవితాన్ని చాలించాలనుకునే ఓ వ్యక్తి ,రియల్‌ టైమ్ సైక‌లాజిక‌ల్ గేమ్‌లోకి ఎలా ప్రవేశించాడు? గేమ్‌లోని టాస్క్‌ను ఎలా స్వీకరించాడు? అసలు ఆ గేమ్‌ ఎంచుకోవ‌డానికి కారణం ఏమిటి? ఈ గేమ్‌ ఎవరు ఆడిస్తున్నారు? అనే అంశాలతో  గేమ్ ఆన్ సినిమా తెరకెక్కింది. యాక్ష‌న్‌, రొమాన్స్, ఎమోష‌న్స్ ఆక‌ట్టుకుంటాయి. క‌చ్చితంగా మా సినిమా ప్రేక్ష‌కుల‌కు న్యూ ఎక్స్ పీరియ‌న్స్ ఇస్తుంద‌న్నారు.

నిర్మాత ర‌వి క‌స్తూరి మాట్లాడుతూ గేమ్ ఆన్ చిత్రం ఇటీవ‌లే సెన్సార్ కార్య‌క్ర‌మాలు పూర్త‌య్యాయి. ఇప్ప‌టికే విడుద‌ల చేసిన రెండు పాట‌ల‌కు, టీజ‌ర్ కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. త్వ‌ర‌లో మిగ‌తా పాట‌లు, ట్రైల‌ర్ రిలీజ్ చేసి సినిమాను ఫిబ్ర‌వ‌రి 2న గ్రాండ్ గా విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాం అన్నారు. గీతా నంద్ ఈ చిత్రంతో హీరోగా నెక్ట్స్ లెవ‌ల్ కు వెళ్తాడ‌న్న న‌మ్మ‌కం ఉంది. అలాగే నేహ సోలంకి త‌న అందం తో పాటు అభిన‌యంతో ఆక‌ట్టుకుంటుంది. ద‌ర్శ‌కుడు ద‌యానంద్ క‌థ‌ చెప్పిన దానిక‌న్నా కూడా చిత్రాన్ని అద్భ‌తంగా తెర‌కెక్కించాడన్నారు. సినిమా అవుట్‌పుట్‌ బాగా వచ్చిందని, ఈ చిత్రం కోసం మంచి స్టార్ క్యాస్ట్‌ను తీసుకున్నాం అన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events