Skip to main content

Namaste NRI

ఫ్లోరిడాలో టోర్నడో బీభత్సం

అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలోగల ఫోర్ట్‌ లాడర్‌డేల్‌ బీచ్‌లో టోర్నడో బీభత్సం సృష్టించింది. కొన్ని నిమిషాలపాటు విధ్వంసం రేపిన ఈ టోర్నడో చివరకు ఫోర్ట్‌ లాడర్‌డేల్‌ బీచ్‌లోనే సద్దుమణిగింది. ఈ టోర్నడో దాటికి పలు ఇళ్లు దెబ్బతిన్నాయి. కరెంటు స్తంభాలు కూలిపోయాయి. వైర్లు తెగిపోయాయి. నీళ్లు చేరడంతో విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌లు పేలిపోయాయి. టోర్నడోలో పైకి లేచిన వ్యర్థాలు పడటంతో వీధుల నిండా చెత్త నిండిపోయింది. అయితే ఈ టోర్నడో విధ్వంసంలో స్థానికులెవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఎవరూ గాయపడలేదు.  టోర్నడో వేగంగా బలం పుంజుకొని పలు భవనాలను, విద్యుత్‌ వైర్లను, తీరంలో నిలిచి ఉన్న నౌకలను ఢీ కొట్టిందని ఫోర్ట్‌ లాడర్‌డేల్‌ అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు.

Social Share Spread Message

Latest News