Namaste NRI

ఊహించని విజయం ఇది

చంద్రశేఖర్‌, సోనాలి జంటగా నటించిన చిత్రం ప్లాంట్‌మాన్‌. కె.సంతోష్‌బాబు దర్శకుడు. పన్నా రాయల్‌ నిర్మాత. సైంటిఫిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించిన ఈ చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో నిర్మాత మాట్లాడుతూ ఊహించని విజయం ఇది. వినూత్నమైన కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. సరికొత్త ప్రయత్నమని అందరూ ప్రశంసిస్తున్నారు. ఇదే ఉత్సాహంతో భవిష్యత్తులో మరిన్ని చిన్న సినిమాలను రూపొందిస్తూ నూతన ప్రతిభను ప్రోత్సహించాలనుకుంటున్నా అన్నారు. వినోదం, సైన్స్‌ కలబోసిన ఈ చిత్రం యువతరంతో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్‌ను కూడా మెప్పిస్తు న్నదని దర్శకుడు తెలిపారు. కొత్త కాన్సెప్ట్‌తో తీసిన సినిమాలో భాగం కావడం ఆనందంగా ఉందని హీరో చంద్రశేఖర్‌ చెప్పారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్‌ సభ్యులందరూ పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events