Skip to main content

Namaste NRI

ఫిబ్రవరిలో తిరగబడరసామీ

రాజ్‌తరుణ్‌, మాల్వి మల్హోత్రా జంటగా నటిస్తున్న చిత్రం తిరగబడరసామీ. ఎ.ఎస్‌.రవికుమార్‌ చౌదరి దర్శకుడు. సురక్ష్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై మల్కాపురం శివకుమార్‌ నిర్మిస్తున్నారు. మన్నారా చోప్రా, మకరంద్‌ దేశ్‌పాండే, రఘుబాబు, జాన్‌ విజయ్‌ తదితరులు నటిస్తున్నారు.  ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది.  ఫిబ్రవరిలో విడుదల చేయబోతున్నారు. జహీరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో ఎక్కువ భాగం చిత్రీకర ణ జరిపాం. యువతను మెప్పించే ప్రేమకథ, ఫ్యామిలీస్‌ను ఆకట్టుకునే సెంటిమెంట్‌, మాస్‌ మెచ్చే యాక్షన్‌ అంశాలతో ఈ సినిమాను తీర్చిదిద్దుతున్నాం.తన లక్ష్యం కోసం ఎంతటివారినైనా ఎదిరించే ఓ యువకుడి కథ ఇది. యాక్షన్‌ ఘట్టాలు హైలైట్‌గా నిలుస్తాయి. టీజర్‌కు అద్భుతమైన స్పందన లభించింది. ఫిబ్రవరి మొదటి వారంలో విడుదల చేస్తాం అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: జవహర్‌ రెడ్డి, సంగీతం: జేబీ, రచన-దర్శకత్వం: ఏఎస్‌ రవికుమార్‌ చౌదరి.

Social Share Spread Message

Latest News