Skip to main content

Namaste NRI

గుంటూరు కారం ట్రైలర్‌ వచ్చేసింది

మహేష్ బాబు హీరోగా నటిస్తున్న చిత్రం గుంటూరు కారం. దర్శకుడు త్రివిక్రమ్‌.  నాగవంశీ నిర్మాణ సారథ్యంలో వస్తున్న ఈ చిత్రం ఈనెల 12న విడుదల కానుంది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను మేకర్స్‌ విడుదల చేశారు. అభిమానుల అంచనాలకు తగ్గట్టే ట్రైలర్‌ అదిరిపోయింది. దాదాపు 20 ఏళ్ల తర్వాత మహేష్ బాబు మళ్ళీ ఫుల్ మాస్ అవతారంలో కనిపిస్తున్నాడు. 17 సంవత్సరాల తర్వాత స్మోకింగ్ సీన్స్ ఈ సినిమాలోనే చేశాడు. అతిథి తర్వాత ఈయన స్మోకింగ్ సీన్స్ ఏ సినిమాలో చేయలేదు. కానీ మళ్ళీ గుంటూరు కారం కోసమే బీడీ ముట్టుకున్నాడు మహేష్ బాబు. దానికి తోడు సినిమాలో మహేష్ బాబు క్యారెక్టర్ కూడా ఫుల్ కమర్షియల్ మాస్ మసాలాగా ఉంది. కొన్ని సంవత్సరాలుగా సూపర్ స్టార్ అభిమానులు ఎలా అయితే చూడాలనుకుంటు న్నారో అలాగే త్రివిక్రమ్ చూపించాడు.

Social Share Spread Message

Latest News