Skip to main content

Namaste NRI

అలాంటి ఘటన పునరావృతం కాకుండా ..జో బైడెన్‌కు

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ వేదిక పై ఇబ్బందికర పరిస్థితులుఎదుర్కొకుండా ఆయన సతీమణి సాయం చేశారు.  2021 జనవరి 6న జరిగిన అల్లర్లను గుర్తు చేసుకుంటూ ప్రసంగించిన తర్వాత వేదికపై నుంచి ఆయనను జిల్‌ బైడెన్‌ చేయ్యి పట్టుకుని తీసుకువచ్చారు. గతంలో ప్రసంగం ముగిసిన తర్వాత ఆయన పలు మార్లు గందరగోళ పరిస్థితికి గురయ్యారు. స్టేజ్‌పైనే ఉండి గాల్లోనే కరచాలనం చేయడం, ఎటువైపు వెళ్లాలో తెలియక ఇబ్బంది పడిన సంఘటనలు చోటు చేసుకున్నాయి. అలాంటి పునరావృతం కాకుండా వైట్‌ హౌస్‌ సిబ్బంది జిల్‌ను స్టేజ్‌పైకి అనుమతించినట్లు తెలిసింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించి న బైడెన్‌ మాజీ అధ్యక్షుడు ట్రంప్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ట్రంప్‌ అధికారంలోకి రావడం కోసం ప్రజా స్వామ్యాన్ని పణంగా పెడతారని దూషించారు.

Social Share Spread Message

Latest News