దర్శకుడు ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వస్తున్న ఫస్ట్ ఇండియన్ ఒరిజినల్ సూపర్ హీరో మూవీ హనుమాన్. తేజ సజ్జా కథా నాయకుడిగా నటించిన ఈ సినిమా ఇప్పటికే గ్లోబల్ లెవల్‌లో క్రేజ్ సంపా దించుకుంది. ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై కె.నిరంజన్‌రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని చైతన్య సమర్పిస్తున్నారు. నేడు విడుదల కానున్న ఈ చిత్ర విశేషాలను ప్రశాంత్ వర్మ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. హనుమాన్ కోసం తేజను మేకోవర్ చేయించాను. జాంబిరెడ్డి లో సిటీ బాయ్‌లా, ఇందులో పల్లె టూరి కుర్రాడిలా చూపించాం. సినిమాల్లో తేజకు ఇంకా మాస్ ఇమేజ్ రాలేదు. ఈ మూవీలోని పాత్రకు తేజనే కరెక్ట్ అనుకున్నాం. సూపర్ హీరో ఫిల్మ్ టెంప్లేట్‌లోనే ఉంటుందీ మూవీ. బ్యాట్‌మెన్ లాంటి సినిమాను రాజ మౌళిగారు చేస్తే ఎలా ఉంటుందో ఈ సినిమా అదే తరహాలో ఉంటుంది. కేజీఎఫ్ లో యష్‌ని చూపించి నట్లే నేను హనుమంతుడిని చూపించబోతున్నాను. హనుమాన్ విజయం సాధిస్తే పదేళ్లపాటు గర్వంగా చెప్పుకొనే సినిమాల ప్రణాళిక ఉంది అని చెప్పారు.














