లావణ్య త్రిపాఠి వెబ్ సిరీస్‌తో రీఎంట్రీ ఇస్తోంది. ఈ భామ చాలా రోజుల గ్యాప్ తర్వాత నటిస్తున్న తాజా వెబ్ సిరీస్ మిస్ పర్ఫెక్ట్. అభిజీత్, అభిజ్ఞ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సిరీస్‌కు విశ్వక్ కే ఖండేరావ్ దర్శక త్వం వహిస్తుండగా, ప్రముఖ ఓటీటీ దిగ్గజం డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో నేరుగా విడుదల కానుంది. ఇప్పటికే ఈ సిరీస్ నుంచి ఫస్ట్ లుక్ విడుదల చేయగా, మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. ఇక ప్రస్తుతం షూటింగ్ జరుపు కుంటున్న ఈ సిరీస్ నుంచి మేకర్స్ టీజర్ విడుదల చేశారు. నేను తెలిసిన ఎవరికైనా నా గురించి తెలిసే ఫస్ట్ విషయం నాకు క్లీనింగ్ అంటే చాలా ఇష్టం. థట్స్ యువర్ ప్రాబ్లమ్. పర్ఫెక్షన్ ప్రాబ్లమ్ ఎలా అవుతుంది. ఒక సింగర్ దగ్గరికి వెళ్లి మాటల్లో చెప్పొచ్చుగా పాటలో ఎందుకు అంటారా, అనే సంభాషణలతో టీజర్ మొదలవుతుంది. ఇక టీజర్ గమనిస్తే, ఈ సిరీస్‌లో లావణ్య దేనినైనా పర్ఫెక్ట్ గా ఉంచాలనే పాత్రలో నటిస్తుం ది. అయితే తాను ఇలా ఉండడం వలన జరిగిన సమస్యలు ఏంటి అనేది తెలియాలంటే ఈ సిరీస్ చూడా ల్సిందే. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై సుప్రియ యార్లగడ్డ నిర్మిస్తోంది. ఈ మిస్ పర్ఫెక్ట్ సిరీస్ త్వరలోనే స్ట్రీమింగ్ అవ్వబోతున్నట్లు ప్రకటించారు.














