Namaste NRI

హ‌నుమాన్ అరుదైన రికార్డు

టాలీవుడ్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన రీసెంట్ బ్లాక్ బ‌స్ట‌ర్ హ‌నుమాన్. జ‌న‌వ‌రి 12న ప్రేక్ష‌కు ల ముందుకు వ‌చ్చిన ఈ చిత్రం బ్లాక్ బ‌స్ట‌ర్ టాక్‌తో బాక్సాఫీస్ దగ్గర దుమ్ముదులుపుతోంది. ఇక ఈ సినిమా చూసిన అభిమానులు కూడా మూవీ బాగుంద‌ని, వీఎఫ్ఎక్స్, విజువల్స్​ అయితే హాలీవుడ్ రేంజ్‌లో ఉన్నాయ ని చెబుతున్నారు. అయితే ఈ సినిమా తెలంగాణ‌లో ప‌రిమిత‌ థియేట‌ర్‌లలోనే విడుద‌ల అయ్యింది. ఇక మూవీ టాక్ మంచిగా రావ‌డంతో సినిమా చూద్దామనుకున్నా అభిమానులకు థియేట‌ర్‌లు లేక నిరాశే ఎదురవు తుంది.

ఈ సినిమాకు సంబంధించి మూవీ ల‌వ‌ర్స్‌కు చిత్రయూనిట్ గుడ్ న్యూస్ తెలిపింది. ప‌బ్లిక్ నుంచి వ‌స్తున్న భారీ రెస్పాన్స్ వ‌ల‌న ఈరోజు నుంచి హ‌నుమాన్‌కు అదనపు మార్నింగ్ షోలను క‌లుపుతున్న‌ట్లు చిత్ర‌బృందం ప్ర‌క‌టించింది. ఈ చిత్రం బుక్ మై షోలో అరుదైన రికార్డు అందుకుంది. ఈ మూవీకి సంబంధించి కేవ‌లం రెండు రోజుల్లోనే బుక్ మై షోలో 10 లక్షల టికెట్లు బుక్ అయ్యాయి. ఈ విష‌యాన్ని నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. తెలుగులో తొలి సూపర్ హీరో చిత్రంగా వచ్చిన ఈ హనుమాన్ చిత్రం విడుదలకు ముందే ఇండియా వైడ్​గా మంచి హైప్​ను అందుకుంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events