Namaste NRI

వివేక్ రామస్వామిపై డొనాల్డ్‌  ట్రంప్ ఆగ్రహం

మాజీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌  ట్రంప్ మొట్టమొదటిసారి తన ప్రత్యర్థి వివేక్ రామస్వామిపై విరుచుకు పడ్డారు. ఇండోఅమెరికన్ వాణిజ్యవేత్త అయిన వివేక్ మోసపూరిత ప్రచారం సాగిస్తున్నారని ట్రంప్ తీవ్రంగా మండిపడ్డారు. లోవా రాష్ట్రంలో చతుర్ వార్షిక ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కాను న్న నేపథ్యంలో ట్రంప్ నుంచి ఈ తీవ్ర విమర్శలు వెలువడ్డాయి. ఈ ఎన్నికల ప్రక్రియలో అధ్యక్ష అభ్యర్థిని రిపబ్లికన్లు, డెమోక్రాట్లు ఎన్నుకుంటారు. 38 ఏళ్ల రామస్వామి నుంచి అనేక వ్యాఖ్యలు, పోస్ట్‌లు వెలువడిన తరువాత ట్రంప్ తీవ్ర గా స్పందించారు. రామస్వామికి చెందిన కొంతమంది యువకులు తాము ధరించిన షర్టుల మీద సేవ్ ట్రంప్, ఓట్ వివేక్‌ అన్న నినాదాలు ఉన్నాయి.

లోవాలోని రాక్ రాపిడ్స్‌లో జరిగిన ప్రచార కార్యక్రమంలో నినాదాలతో ఉన్న షర్టులను యువకులు ధరించా రు. ఈ ఫోటోలను షేర్ చేయడంతో అవి ట్రంప్ దృష్టికి వెళ్లాయి. దాంతో వివేక్ ప్రచార తీరుపై ధ్వజమెత్తారు. ట్రంప్ గొప్ప ప్రెసిడెంట్ అని ప్రశంసిస్తూ ట్రంప్‌కు గొప్ప మద్దతుదారునిగా వివేక్ మొదట ప్రచారం ప్రారంభిం చారు. కానీ యువకుల షర్టులపై నినాదాలతో కథ మారింది. వివేక్ మాయలో పడవద్దని హెచ్చరిస్తూ ఓట్ ఫర్ ట్రంప్ మీ ఓటు వృధా చేయవద్దు  అని ట్రంప్ హెచ్చరించారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events