Namaste NRI

కథ విన్నప్పుడే హిట్‌ అని చెప్పారు :నాగార్జున

నాగార్జున హీరోగా నటిస్తున్న చిత్రం నా సామిరంగ. విజయ్‌ బిన్ని దర్శకత్వం. శ్రీనివాస చిట్టూరి నిర్మించారు.  ఆదివారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. అల్లరి నరేష్‌, రాజ్‌తరుణ్‌ కీలక పాత్రలను పోషించారు. థాంక్స్‌ మీట్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ ఈ సినిమా ఫలితంతో చాలా ఆనందంగా ఉన్నా. సంక్రాంతికి హిట్‌ కొట్టాలనే సంకల్పంతో టీమ్‌ అందరూ కష్టపడ్డారు. మా అంచనాలను నిజం చేస్తూ సినిమాకు అద్భుతమైన స్పందన లభిస్తున్నది అన్నారు.  ఈ సినిమాకు కీరవాణి సంగీతం ప్రధానాకర్షణగా నిలిచింది.కొత్త దర్శకుడు విజయ్‌ బిన్ని అద్భుతంగా హ్యాండిల్‌ చేశాడు. అతనికి మంచి భవిష్యత్తు ఉంటుంది. నిర్మాత శ్రీనివాస చిట్టూరి కథ విన్నప్పుడే హిట్‌ పక్కా అన్నారు. ఈ రోజు ఆయన మాటలు నిజమయ్యాయి. కథలోని ఎమోషన్స్‌, కామెడీ, ఫ్రెండ్షిప్‌ అంశాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి అన్నారు.

ఈ సినిమాలో వింటేజ్‌ నాగార్జునను చూసి ఆయన అభిమానులు సంబురపడుతున్నారని, తన ఫేవరేట్‌ యాక్టర్‌ నాగార్జునతో కలిసి కెరీర్‌లో గుర్తుండిపోయే పాత్రను చేశానని అల్లరి నరేష్‌ అన్నారు. అభిమానులకు మాటిచ్చిన విధంగానే సినిమాలో వింటేజ్‌ నాగార్జునను చూపించానని దర్శకుడు విజయ్‌ బిన్ని తెలిపారు. విడుదలైన అన్ని కేంద్రాల్లో అద్భుతమైన స్పందన లభిస్తున్నదని నిర్మాత శ్రీనివాస చిట్టూరి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్‌ సభ్యులందరూ పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events