Namaste NRI

ప్రభాస్‌ ఫ్యాన్స్‌కు మరో గుడ్‌న్యూస్‌ 

మంచు విష్ణు కలల ప్రాజెక్టు భక్త కన్నప్ప ఇప్పుడు టాలీవుడ్‌లో టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా మారింది. ఈ సినిమాను ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మంచు వారబ్బాయి, బడ్జెట్‌ గురించి ఏమాత్రం వెనుకడుగు వేయడం లేదు. క్యాస్టింగ్‌తో మొదలుపెడితే గ్రాఫిక్స్‌ దాకా ఎక్కడా కంప్రమైజ్‌ కావడం లేదు. దీంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందో చూడాలని తెలుగు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో భక్త కన్నప్ప గురించి మంచు విష్ణు కీలక అప్‌డేట్‌ ఇచ్చాడు. అంతేకాదు ఈ సినిమాలో ప్రభాస్‌ పాత్ర ఎలా ఉండబోతుందో చెప్పి, రెబల్‌ స్టార్‌ ఫ్యాన్స్‌కు ట్రీట్‌ ఇచ్చాడు.

కన్నప్ప సినిమా విడుదల కోసం సౌత్‌లోనే కాదు నార్త్‌ ఆడియన్స్‌ కూడా అడుగుతున్నారని మంచు విష్ణు చెప్పాడు. ఈ సినిమా షూటింగ్‌ దాదాపు 60 శాతం పూర్తయ్యిందని, తొందరలోనే మిగతా పార్ట్‌ షూటింగ్‌ కంప్లీట్‌ చేస్తామని తెలిపాడు. ఈ ఏడాది చివరలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపాడు. త్వరలోనే కన్నప్ప గ్లింప్స్‌ విడుదల చేస్తామని మంచు వారబ్బాయి చెప్పాడు. అంతేకాదు ప్రభాస్‌ రోల్‌ గురించి కూడా చిన్న హింట్‌ ఇచ్చాడు. ఈ సినిమాలో ప్రభాస్‌ పాత్ర చాలా అద్భుతంగా ఉంటుందని అన్నాడు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడే చెబితే థ్రిల్‌ ఉండదని, సమయం వచ్చినప్పుడు తానే వెల్లడిస్తానని అన్నాడు. మరో నెలలో న్యూజిలాండ్‌ వెళ్లాలని, మిగిలిన షూటింగ్‌ కూడా అక్కడే కంప్లీట్‌ చేస్తామని చెప్పాడు. అంతేకాదు ఈ సినిమాలో తన తండ్రి మోహన్‌బాబుతో పాటు తన కొడుకు అవ్రామ్‌ కూడా నటిస్తున్నాడని తెలిపాడు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events