Skip to main content

Namaste NRI

కనిపించిన మకర జ్యోతి.. అయ్యప్పనామ స్మరణతో మార్మోగిన శబరిమల

అయ్యప్ప నామస్మరణలతో శబరిమల పులకించింది. మకరజ్యోతి దర్శనం చేసుకున్న భక్తుల శరణుఘోషతో శబరిగిరి పులకించింది. సోమవారం సాయంత్రం 6. గంటల ప్రాంతంలో మకర జ్యోతి రూపంలో పొన్నాం బలమేడు కొండల్లో అయ్యప్ప స్వామి భక్తులకు దర్శనమిచ్చారు. మకర జ్యోతి రూపంలో అయ్యప్ప స్వామిని దర్శించుకోవడం వల్ల భాగ్యం కలుగుతుందని భక్తుల నమ్మకం. దీంతో మకర జ్యోతి దర్శనం కోసం ప్రతి ఏడాదిలాగే శబరిమలకు భక్తజనం పోటెత్తారు. భారీగా భక్తులు తరలిరావడంతో మకర జ్యోతి దర్శనం కోసం పంబా, సన్నిధానం, పులిమేడ్‌, నీలికల్‌ ప్రాంతాల్లో ట్రావెన్‌కోర్‌ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సోమవారం సాయంత్రం మకర జ్యోతి రూపంలో అయ్యప్ప స్వామి దర్శనం కావడంతో అయ్యప్ప భక్తులు భక్తిపారవశ్యంలో మునిగిపోయారు. అయ్యప్ప నామస్మరణలతో శబరిగిరి మార్మోగిపోయింది.

Social Share Spread Message

Latest News