Skip to main content

Namaste NRI

మెగాస్టార్ ఇంట సంక్రాంతి సందడి

సంక్రాంతి పండగను సినీ ప్రముఖులు ఘనంగా జరుపుకుంటున్నారు. మెగా ఫ్యామిలీ మొత్తం ఒకచోటుకు చేరుకుని సంక్రాంతి సంబరాలు చేసుకున్నారు. బెంగళూరులోని ఫామ్ హౌస్ లో మెగా ఫ్యామిలీతోపాటు అల్లు ఫ్యామిలీ కలిసి సంప్రదాయ పద్దతిలో సంక్రాంతిని సంతోషంగా జరుపుకున్నారు. తన తల్లి అంజనాదేవి, సతీమణి సురేఖతోపాటు రాంచరణ్‌, ఉపాసన దంపతులు, అల్లు అర్జున్‌-స్నేహ, వరుణ్‌ తేజ్‌-లావణ్య త్రిపాఠి, అకీరా నందన్‌, ఆద్య, నిహారిక, శ్రీజ, అల్లు శిరీష్‌ సహా ఇతర కుటుంబసభ్యులు సంక్రాంతి వేడుకల్లోపాల్గొన్న ఫొటోను షేర్‌ చేస్తూ.. పాడి పంటల, భోగభాగ్యాల ఈ సంక్రాంతి ప్రతి ఇంటా ఆనందాల పంటలు పండించాలని ఆశిస్తూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశాడు చిరంజీవి. ఈ ఫోటో చేసిన అభిమానులు మెగా ఫ్యామిలీని చూసి మురిసిపోతున్నారు. ఫోటో అదిరిందంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Social Share Spread Message

Latest News