Skip to main content

Namaste NRI

వరుణ్‌ తేజ్‌ బర్త్‌డే స్పెషల్‌.. మట్కా గ్లింప్స్‌ చూశారా

హీరో వరుణ్‌ తేజ్‌ మట్కా అనే సినిమాతో పాన్‌ ఇండియాలో అరంగేట్రం చేస్తున్నారు. నోరా ఫతేహీ, మీనాక్షి చౌదరి హీరోయిన్స్‌.   కరుణ కుమార్‌ దర్శకత్వం.  వైర ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఎస్‌ఆర్‌టీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. హైదరాబాద్‌లో వేసిన ఓ భారీ సెట్‌లో ప్రస్తుతం షూటింగ్‌ జరుగుతోం ది. వరుణ్‌ తేజ్‌కు పుట్టిన రోజు సందర్భంగా మట్కా ఓపెనింగ్‌ బ్రాకెట్‌ వీడియోను విడుదల చేశారు. 1958-1982 మధ్య జరిగిన సంచలన యధార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కిస్తున్న కథ ఇది. నవీన్‌ చంద్ర, కన్నడ కిశోర్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానున్న ఈ చిత్రానికి డీవోపీ: ఏ కిశోర్‌ కుమార్‌, సంగీతం: జీవీ ప్రకాశ్‌ కుమార్‌, నిర్మాతలు: డాక్టర్‌ విజయేందర్‌రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి, కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: కరుణ కుమార్‌.

Social Share Spread Message

Latest News