Namaste NRI

ప్రపంచంలోనే అత్యంత సంపన్న కుటుంబం!

యునైటెడ్ అర‌బ్ ఎమిరేట్స్‌కు చెందిన అల్ న‌హ‌య‌న్ రాజ కుటుంబం ఆస్తులు అంతులేనివి. ఆ కుటంబ సంప‌ద ‌ను లెక్కించం క‌ష్ట‌మే. దుబాయ్‌కు చెందిన ఆ రాచ కుటుంబం సుమారు 4078 కోట్ల ఖ‌రీదైన అధ్య‌క్ష భ‌వ‌నంలో నివాసం ఉంటోంది. ఆ విలాస‌వంత‌మైన భ‌వ‌నం సుమారు మూడు పెంట‌గాన్ల అంత పెద్ద‌గా ఉంటుంద‌ట‌. ఇక ఆ కుటుంబం వ‌ద్దే 8 ప్రైవేటు విమానాలు కూడా ఉన్నాయి. అత్యంత ఖ‌రీదైన ఫుట్‌బాల్ క్ల‌బ్‌లోనూ ఆ ఫ్యామిలీకి షేర్ ఉన్న‌ది. యూఏఈ అధ్య‌క్షుడు షేక్ మ‌హ‌మ్మ‌ద్ బిన్ జాయెద్ అల్ న‌హ్‌య‌న్‌, ఆ కుటుంబ పెద్ద‌. ఆయ‌న్ను ఎంబీజెడ్ కూడా పిలుస్తారు. బిన్ జాయెద్‌కు 18 మంది సోద‌రులు, 11 మంది సిస్ట‌ర్స్ ఉన్నారు. ఎమిరేట్స్‌కు చెందిన ఆ రాచ కుటుంబ పెద్ద‌కు 9 మంది పిల్ల‌లు, 18 మంది మ‌న‌వులు, మ‌న‌వరాళ్లు ఉన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events