తేజేశ్వర్, ప్రజ్ఞ నయన్ జంటగా నటించిన చిత్రం మిషన్ సి 1000. తేజేశ్వర్ దర్శకత్వం. ఎస్.వి.క్రియేషన్స్ సంస్థ నిర్మించిన ఈ చిత్రం షూటింగ్ కార్యక్రమాలను పూర్తిచేసుకుంది. త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. నేడు అయోధ్య రామ మందిరంలో బాల రాముడి విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా శ్రీరాముడి నేపథ్యంలో వచ్చే పాటను విడుదల చేశారు. శ్రీధర్ ఆత్రేయ స్వరపరిచిన ఈ పాటను విజయ్ ప్రకాష్ ఆలపించారు. జేపీ, సుధ, కబీర్‌సింగ్, సంజయ్‌పాండే, అనీష్ కురువిల్లా తదితరులు నటించారు. ఈ చిత్రానికి కెమెరా: సుధాకర్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: తేజేశ్వర్.














