Namaste NRI

సెప్టెంబర్‌లో ఓజీ రాక!

పవన్‌కల్యాణ్‌ నటిస్తున్న తాజా చిత్రం ఓజీ. సుజీత్‌ దర్శకుడు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ప్రియాంక అరుళ్‌ మోహన్‌ కథానాయిక. గ్యాంగ్‌స్టర్‌ డ్రామాగా తెరకెక్కిస్తున్నారు. ముంబయి మాఫియా నేపథ్యంలో సాగే ఈ కథలో పవన్‌కల్యాణ్‌ ైస్టెలిష్‌ డాన్‌గా కనిపించనున్నారు. సాంకేతి కంగా ఉన్నత ప్రమాణాలతో తెరకెక్కిస్తున్నారు. ఇమ్రాన్‌హష్మీ, అర్జున్‌దాస్‌, శ్రియా రెడ్డి, ప్రకాష్‌రాజ్‌ తదితరు లు నటిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. కొద్ది మాసాల క్రితం విడుదల చేసిన ఫస్ట్‌గ్లింప్స్‌ సినిమా పై మరింతగా అంచనాలను పెంచింది. దాంతో సినిమా విడుదల ఎప్పుడోనని అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.  ఈ చిత్రాన్ని సెప్టెంబర్‌ 27న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్‌ చేయబోతున్నట్లు మేకర్స్‌ తెలిపారు.  ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: రవి కె చంద్రన్‌, ప్రొడక్షన్‌ డిజైనర్‌: ఏఎస్‌ ప్రకాష్‌, సంగీతం: తమన్‌, రచన-దర్శకత్వం: సుజీత్‌.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events