Namaste NRI

నమీబియా అధ్యక్షుడు గింగోబ్‌ ఇకలేరు

నమీబియా అధ్యక్షుడు హేజ్ గింగోబ్ (82) ఇకలేరు. గత కొన్ని రోజులుగా క్యాన్సర్‌తో బాధపడుతున్న హేజ్.. ఆదివారం తెల్లవారుజామున విండ్‌హోక్‌లోని లేడీ పోహంబా ఆస్పత్రిలో కన్నుమూశారు. నమీబియా అధ్యక్ష కార్యాలయం ఈ విషయాన్ని వెల్లడించింది. అధ్యక్షుడు హేజ్‌ గింగోబ్‌ మృతిచెందారని సోషల్ మీడియాలో కూడా పోస్ట్‌ చేశారు. 2014లో అస్వస్థతకు గురైన గింగోబ్‌ సాధారణ వైద్య పరీక్షలు చేయించుకోగా ప్రొస్టేట్‌ క్యాన్సర్‌ సోకినట్లు తేలింది. అప్పటి నుంచి ఆయన చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో ఇటీవల చికిత్స కోసం యునైటెడ్ స్టేట్స్‌కు వెళ్తానని కూడా హేజ్ పేర్కొన్నట్లు ప్రెసిడెన్సీ తెలిపింది. కానీ ఇంతలో ఆయన మరణించారు. 2014లో క్యాన్సర్‌ బారినపడిన గింగోబ్‌ మరుసటి సంవత్సరం అధ్యక్షుడయ్యారు.

Social Share Spread Message

Latest News