Skip to main content

Namaste NRI

రావు రమేష్‌ మారుతినగర్‌ సుబ్రమణ్యం ఫస్ట్‌లుక్‌ రిలీజ్‌

రావురమేశ్‌ హీరోగా నటిస్తున్నచిత్రం మారుతి నగర్‌ సుబ్రమణ్యం.  ఇంద్రజ కథానాయిక. లక్ష్మణ్‌ కార్య దర్శకుడు. బుజ్జి రాయుడు పెంట్యాల, మోహన్‌ కార్య నిర్మాతలు. నిర్మాణంలో ఉన్న ఈ సినిమాకు చెందిన ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను వినూత్నంగా ప్రేక్షకుల ద్వారా విడుదల చేశారు. ఈ లుక్‌లో గళ్లచొక్కా, లుంగీతో మాస్‌ అవతారంలో కనిపిస్తున్నారు రావు రమేశ్‌. రావురమేశ్‌ ఇందులో కొత్తగా కనిపిస్తారు. వినోదం, భావోద్వేగాల మేళవింపుగా ఈ సినిమా ఉంటుంది. రావు రమేశ్‌ ఫస్ట్‌లుక్‌కి మంచి స్పందన వస్తున్నది అంటూ దర్శక, నిర్మాతలు ఆనందం వెలిబుచ్చారు. నటుడిగా తనకు ఈ స్థాయిని, స్థానాన్ని ఇచ్చిన ప్రేక్షకులే తన ఫస్ట్‌లుక్‌ ని ఆవిష్కరించడం పట్ల రావు రమేశ్‌ సంతోషం వ్యక్తం చేశారు. అంకిత్‌ కొయ్య, రమ్య పసుపులేటి, హర్షవర్దన్‌, అజయ్‌, అన్నపూర్ణమ్మ, ప్రవీణ్‌ ఇతర పాత్రలు పోషించిన్నారు. ఈ చిత్రానికి కెమెరా: ఎం.ఎన్‌.బాల్‌రెడ్డి.

Social Share Spread Message

Latest News