Skip to main content

Namaste NRI

తెప్ప సముద్రం నుండి పెంచల్ దాస్ పాడిన నా నల్లా కలువా పువ్వా 

చైతన్యరావు, అర్జున్‌ అంబటి, కిశోరి దాత్రక్‌, రవిశంకర్‌ ప్రధానపాత్రధారులుగా రూపొందుతోన్న చిత్రం తెప్పసముద్రం. సతీశ్‌ రాపోలు దర్శకుడు. నీరుకంటి మంజులా రాఘవేందర్‌గౌడ్‌ నిర్మాత. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా పి.ఆర్‌ సంగీత దర్శకత్వంలో పెంచలదాస్‌ రాసి, పాడిన నా నల్లా కలువా పువ్వా సాంగ్‌ని చిత్రబృందం విడుదల చేశారు. దుర్మార్గుల చేతుల్లో అమాయకమైన అమ్మాయిలు ఎలా బలైపోతున్నారో, వారికోసం కుటుబం పడుతున్న బాధలు, రోదనలు ఈ పాటలో మనసు కదిలించేలా చూపించడం జరిగిందని, దర్శకుడు సతీష్‌ అద్భుతమైన కథతో ఈ సినిమాను మలిచాడని, అవుట్‌పుట్‌ చాలా బాగా వచ్చిందని నిర్మాత తెలిపారు. ప్రేక్షకులకు నచ్చే మంచి కమర్షియల్‌ సినిమా ఇదని దర్శకుడు చెప్పారు. నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఏప్రిల్‌ 12న విడుదల కానుంది. ఈ చిత్రానికి మాటలు: శ్రావణ్‌, కెమెరా: శేఖర్‌ పోచంపల్లి.

Social Share Spread Message

Latest News