మంచు లక్ష్మి ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ఆదిపర్వం. సంజీవ్ కుమార్ మేగోటి దర్శకుడు. ఎమ్.ఎస్.కె. నిర్మాత. ఈ సినిమా పాటలను విడుదల చేశారు. ఈ వేడుకకు ఆర్.పి.పట్నాయక్, ఎమ్.ఎమ్. శ్రీలేఖ, రఘు కుంచె, ఘంటాడి కృష్ణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. దర్శకుడు మాట్లాడుతూ కథానుగు ణంగా పాటలు అద్భుతంగా కుదిరాయి. ఇది అమ్మవారిని నమ్ముకున్న ఓ భక్తురాలి కథ. ఆ భక్తురాలిని దుష్ట శక్తుల నుంచి కాపాడే క్షేత్రపాలకుడి కథగా ఆకట్టుకుంటుంది. 1974 నుంచి 1992 మధ్య నడిచే పీరియాడి క్ డ్రామాగా మెప్పిస్తుంది అన్నారు. ఈ చిత్రానికి మాధవ్ సైబా, సంజీవ్ మేగోటి, బి.సుల్తాన్ వలి, ఓపెన్ బనానా, లుబెక్ లీ మార్విన్ సంగీతాన్నందించారు. శివ కంఠంనేని, ఆదిత్య ఓం, ఏస్తర్ నోరోనా, శ్రీజితఘోష్, వెంకట్ కిరణ్, సత్యప్రకాష్ తదితరులు ఇతర తారాగణం.