Skip to main content

Namaste NRI

ఇది అమ్మవారిని నమ్ముకున్న ఓ భక్తురాలి కథ

మంచు లక్ష్మి ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ఆదిపర్వం. సంజీవ్‌ కుమార్‌ మేగోటి దర్శకుడు. ఎమ్‌.ఎస్‌.కె. నిర్మాత. ఈ సినిమా పాటలను విడుదల చేశారు. ఈ వేడుకకు ఆర్‌.పి.పట్నాయక్‌, ఎమ్‌.ఎమ్‌. శ్రీలేఖ, రఘు కుంచె, ఘంటాడి కృష్ణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. దర్శకుడు మాట్లాడుతూ కథానుగు ణంగా పాటలు అద్భుతంగా కుదిరాయి.  ఇది అమ్మవారిని నమ్ముకున్న ఓ భక్తురాలి కథ. ఆ భక్తురాలిని దుష్ట శక్తుల నుంచి కాపాడే క్షేత్రపాలకుడి కథగా ఆకట్టుకుంటుంది. 1974 నుంచి 1992 మధ్య నడిచే పీరియాడి క్‌ డ్రామాగా మెప్పిస్తుంది అన్నారు. ఈ చిత్రానికి మాధవ్‌ సైబా, సంజీవ్‌ మేగోటి, బి.సుల్తాన్‌ వలి, ఓపెన్‌ బనానా, లుబెక్‌ లీ మార్విన్‌ సంగీతాన్నందించారు. శివ కంఠంనేని, ఆదిత్య ఓం, ఏస్తర్‌ నోరోనా, శ్రీజితఘోష్‌, వెంకట్‌ కిరణ్‌, సత్యప్రకాష్‌ తదితరులు ఇతర తారాగణం.

Social Share Spread Message

Latest News