
ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం కల్కి 2898 ఎ.డి. వైజయంతి మూవీస్ బ్యానర్‌పై అశ్విన్ దత్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తుండగా, ఈ సినిమాకు మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నాడు. దీపికా పదుకొనే, దిశా పటానీ కథానాయికలుగా నటిస్తుండగా.. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా విడుదలకు ఇంకా 22 రోజులే ఉండడంతో వరుస ప్రమోషన్స్ పాల్గోంటుంది కల్కి టీమ్. అయితే ఈ సినిమా ట్రైలర్ కోసం ప్రభాస్ అభిమానులు ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ట్రైలర్‌కు సంబంధించిన అప్‌డేట్‌ను ఇచ్చారు మేకర్స్. ఈ మూవీ ట్రైలర్‌ను జూన్ 10న విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. దీనితో పాటు గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేయనున్నట్లు సమాచారం. జూన్ 27న ప్రేక్షకుల ముందుకు సినిమా రానుంది.















