Skip to main content

Namaste NRI

 సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు… మాజీ అధ్యక్షుల కూ మినహాయింపు

అధ్యక్ష ఎన్నికల్లో (2020) ప్రజాతీర్పును మార్చివేసేందుకు యత్నించారనే అభియోగాలను ఎదుర్కొంటున్న అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్‌ పార్టీ నేత డొనాల్డ్‌ ట్రంప్‌నకు ఆ దేశ సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. నేరాభియోగాల విచారణల నుంచి మాజీ అధ్యక్షులకూ మినహాయింపు ఉంటుందని సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును 9 మందితో కూడిన ధర్మాసనంలో ఆరుగురు న్యాయమూర్తులు సమర్థించగా, ముగ్గురు న్యాయమూర్తులు వ్యతిరేకించారు. కోర్టు తాజా నిర్ణయంతో నవంబరులో జరిగే అధ్యక్ష ఎన్నికలలోపు న్యాయస్థానాల్లో ట్రంప్‌ను విచారించే అవకాశాలు ఉండవు. స్పెషల్‌ కౌన్సెల్‌ జాక్‌ స్మిత్‌ మోపిన అభియోగాల్లో మిగిలిన వాటిపై విచారణ కోసం ట్రయల్‌ కోర్టుకు ఈ కేసును న్యాయస్థానం తిప్పిపంపినప్పటికీ అవేవీ ఇప్పట్లో విచారణకు వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది.

బాలెట్‌ పత్రాల్లో ట్రంప్‌ పేరు చేర్చవద్దన్న కింది కోర్టు తీర్పును నిలిపివేసిన తర్వాత ట్రంప్‌నకు అనుకూ లంగా సర్వోన్నత న్యాయస్థానంలో వెలువడిన మరో తీర్పు ఇది.  అమెరికా రాజ్యాంగంలో పొందుపరిచిన అధికారాల విభజనను అనుసరించి ప్రస్తుత అధ్యక్షునికి ఉన్నట్లే మాజీ అధ్యక్షునికి నేరాభియోగ విచారణ నుంచి సంపూర్ణ మినహాయింపు ఉంటుందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జాన్‌ రాబర్ట్స్‌లో తీర్పులో పేర్కొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events