Skip to main content

Namaste NRI

డైరెక్టర్ శేఖర్ కమ్ముల లాంచ్ చేసిన పైలం పిలగా సోడు సోడు సాంగ్

తెలంగాణ నేపథ్యంలో రూపొందుతున్న సెటైరికల్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ పైలం పిలగా. ఆనంద్‌ గుర్రం దర్శకత్వం. రామకృష్ణ బొద్దుల, ఎస్‌కే శ్రీనివాస్‌ నిర్మాతలు. సాయితేజ కల్వకోట, పావని కరణం జంటగా నటించారు. ఈ సినిమాలోని సోడు సోడు నొక్కమే నీ సోకు అనే పాటను డైరెక్టర్ శేఖర్ కమ్ముల గారు రిలీజ్ చేశారు. దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ వ్యవసాయం చేస్తే కడుపు నిండుతుంది కానీ కోట్లు సంపాదించలేమని బలంగా నమ్మే ఓ యువకుడు సొంత ఊరిలోనే పెద్ద బిజినెస్‌ను ప్రారంభిస్తాడు. ఈ క్రమంలో అతనికి ప్రభుత్వ అధికారుల నుంచి ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయన్నదే ఈ చిత్ర కథ. ఆద్యంతం వినోదాత్మకంగా అలరిస్తుంది అన్నారు. ఈ చిత్రానికి యశ్వంత్‌ నాగ్‌ సంగీతాన్నందించాడు.

Social Share Spread Message

Latest News