Skip to main content

Namaste NRI

సరిపోదా శనివారం ఫస్ట్ లుక్‌లో ప్రియాంక మోహన్.. పోలీస్ పాత్రలో

నాని కథానాయకుడిగా రూపొందుతోన్న చిత్రం సరిపోదా శనివారం. వివేక్‌ ఆత్రేయ దర్శకుడు. డి.వి.వి. దానయ్య, కల్యాణ్‌ దాసరి నిర్మాతలు. ప్రియాంక అరుల్‌ మోహన్‌ కథానాయిక. ఆమె ఇందులో కానిస్టేబుల్‌ చారులతగా నటిస్తున్నది. మేకర్స్‌ ప్రియాంక ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. అందమైన చిరునవ్వుతో ఖాకీ యూనిఫాం ధరించి, భుజంపై బ్యాగ్‌తో నడుచుకుంటూ వస్తున్న ఎన్నోసెంట్‌ పోలీస్‌కానిస్టేబుల్‌గా ప్రియాంక ను ఈ లుక్‌లో చూడొచ్చు. ప్రతిష్టాత్మకంగా నిర్మితమవుతున్న ఈ చిత్రంలో ఎస్‌.జె.సూర్య కీలక పాత్ర పోషిస్తు న్నారు. ఈ చిత్రానికి కెమెరా: మురళి.జి, సంగీతం: జేక్స్‌ బిజోయ్‌, నిర్మాణం: డి.వి.వి.ఎంటర్‌టైన్‌మెంట్స్‌.

Social Share Spread Message

Latest News