Namaste NRI

అమెరికా అధ్యక్ష ఎన్నికలపై.. మరోసారి స్పష్టత ఇచ్చిన ప్రెసిడెంట్

అమెరికా అధ్యక్ష బరిలో నుంచి తాను తప్పుకునేడే లేదని ప్రస్తుత అధ్యక్షుడు, డెమోక్రాట్ అభ్యర్థి జో బైడెన్ స్పష్టం చేశారు. అధ్యక్షుడిగా తన కంటే మెరుగైన అభ్యర్థి ఎవరూ లేరని ఆయన వ్యాఖ్యానించారు. దేవుడు దిగి వచ్చి చెబితే తప్ప తప్పుకోబోనని కూడా బైడెన్ స్పష్టం చేశారు. ఎన్నికల్లో పోటీ చేసేదీ తానే, ట్రంప్‌ను మళ్లీ ఓడించేదీ తానే అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. 2020 ఎన్నికల సమయంలోనూ తాను ఓడిపోతానని ప్రచారం జరిగిందని బైడెన్ గుర్తు చేశారు. అప్పుడు డొనాల్డ్ ట్రంప్‌ను ఓడించి అధ్యక్ష బాధ్యతలు చేపట్టానని, ఇప్పుడు కూడా మరొక సారి ట్రంప్‌పై గెలుస్తానని ఆయన చెప్పారు. మరి నాలుగు సంవత్సరాల పాటు అమెరికన్లకుసేవ చేసే సామర్థం తనకు ఉందని బైడెన్ తెలిపారు.

తన ఆరోగ్యంపై జరుగుతున్న ప్రచారాన్ని, తన జ్ఞాపక శక్తి, మానసిక ఆరోగ్యంపై రిపబ్లికన్లు చేస్తున్న ఆరోపణల ను ఆయన కొట్టిపారేశారు. మానసికంగా, శారీరకంగా తాను ఫిట్‌గా ఉన్నానని బైడెన్ స్పష్టం చేశారు. తనకు ఎటువంటి వైద్య పరీక్షలూ అవసరం లేదని ఆయన చెప్పారు. రిపబ్లికన్ల ఆరోపణల నేపథ్యంలో బైడెన్ ఆరోగ్యంపై కొంత మంది ప్రజల్లో అనుమానం తలెత్తిందని యాంకర్ చెబుతూ, అటువంటి వారి సందేహాలను నివృత్తి చేసేందుకు ప్రైవేట్‌గా వైద్య పరీక్షలు చేయించుకుని, ఫలితాలను జనం ముందు ఉంచే ఆలోచన ఉందా అని అడిగారు. అయితే, అధ్యక్షుడుగా తీరిక లేని పనులతో రోజూ తనకు తానే టెస్ట్‌లు పెట్టుకుంటు న్నానని, తనకు మరే ఇతర పరీక్షలూ అవసరం లేదని ఆయన వివరించారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events

Powered by WordPress