Skip to main content

Namaste NRI

ఇండియన్‌ వీసా అప్లికేషన్‌ సెంటర్లు ప్రారంభం:   అమెరికా

 అమెరికాలోని సీటెల్‌, బెల్లెవ్యూలలో ఇండియన్‌ వీసా అప్లికేషన్‌ సెంటర్‌ (ఐవీఏసీ)లను  ప్రారంభించారు. సీటెల్‌లోని ఐవీఏసీని మేయర్‌ బ్రూస్‌ హర్రెల్‌, కాన్సుల్‌ జనరల్‌ ప్రకాశ్‌ గుప్తా ప్రారంభించారు. ఈ సందర్భంగా హర్రెల్‌ మాట్లాడుతూ  భారత్‌, అమెరికా మధ్య స్నేహ బంధాన్ని పటిష్టం చేయడంలో భారతీయులు విశేష కృషి చేస్తున్నారని ప్రశంసించారు. ప్రకాశ్‌ గుప్తా మాట్లాడుతూ, కొత్తగా ఐవీఏసీలను ప్రారంభించడం ద్వారా పసిఫిక్‌ వాయవ్య రాష్ర్టాలతో సంబంధాలను పెంపొందించుకోవవడలో భారతదేశ నిబద్ధత స్పష్టమవుతున్న దని చెప్పారు.

Social Share Spread Message

Latest News