Skip to main content

Namaste NRI

అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్‌ పై కాల్పులు

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌పై  దుండగులు కాల్పులకు తెగబడ్డాడు. అధ్యక్ష ఎన్నికల ప్రచారం లో భాగంగా పెన్సిల్వేనియాలో నిర్వహించిన ర్యాలీలో ట్రంప్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేదికపై ప్రసంగిస్తుండగా ఆయనపై కాల్పులు జరిగాయి. దీంతో బుల్లెట్‌ ఆయన కుడి చెవికి తాకింది. గాయపడిన ట్రంప్‌ను సిబ్బంది దవాఖానకు తరలించారు. కాల్పులు జరిపిన ఇద్దరిలో ఒకరిని భద్రతా సిబ్బంది హతమార్చినట్లు తెలుస్తున్నది. ప్రస్తుతం ట్రంప్‌ క్షేమంగా ఉన్నారని అధికారులు ప్రకటించారు. కాగా, ఈ దాడిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. ఈ కాల్పుల ఘటనతో అమెరికా ఒక్కసారిగా ఉలిక్కిపడింది.

Social Share Spread Message

Latest News