Skip to main content

Namaste NRI

అల్లరి న‌రేష్ బ‌చ్చల మ‌ల్లి ఫ‌స్ట్ సింగిల్ అప్‌డేట్  

 అల్లరి న‌రేష్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న తాజా చిత్రం బ‌చ్చల మ‌ల్లి. అమృత అయ్యర్‌ కథానాయిక.  ఈ సినిమాకు సుబ్బు మంగాదేవి దర్శక‌త్వం. హాస్యా మూవీస్ పతాకంపై రాజేశ్ దండా, బాలాజీ గుత్తా నిర్మిస్తున్నా రు. విశాల్ చంద్రశేఖర్ సంగీతాన్ని సమకూర్చనున్నాడు. ఇప్పటికే మూవీ నుంచి ఫ‌స్ట్ లుక్‌తో పాటు టీజ‌ర్ విడుద‌ల చేయ‌గా ఆక‌ట్టుకుంటున్నాయి. ఇప్పుడు తాజాగా మూవీ నుంచి ఫ‌స్ట్ సింగిల్ అప్‌డేట్ ఇచ్చారు మేక‌ర్స్.

ఈ మూవీ ఫ‌స్ట్ సింగిల్ మా ఊరి జాతరలో సాంగ్ ను జూలై 16న మధ్యాహ్నం 12.06 గంట‌ల‌కు విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు చిత్రబృందం ప్ర‌క‌టించింది. ఈ సినిమా క‌థ‌ 1990 నేపథ్యంలో ఉండ‌బోతుండ‌గా,  తుని ప్రాంతంలో జరిగిన కొన్ని యదార్థ సంఘటనల స్ఫూర్తితో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారని సమాచారం. రావు రమేశ్, హరితేజ, ప్రవీణ్ తదితరులు ఈ చిత్రంలో కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. ఈ సినిమాను సెప్టెంబ‌ర్‌లో ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్న‌ట్లు తెలిపారు.  ఈ చిత్రానికి కెమెరా: రిచర్డ్‌ ఎం.నాథన్‌.

Social Share Spread Message

Latest News